క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఆటగాడు. ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు ‘గ్లెన్ మాక్స్వెల్’ తెలియని వారుండరు. ప్రస్తుతం ఐపీఎల్-15వ సీజన్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో మాక్స్వెల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, భారతీయ యువతి వినీ రామను శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కరోనా, లాక్డౌన్, ఇతర కారణాల వల్ల వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఈ జంట ఎట్టుకేలకు ఒక్కటైయ్యారు. తమిళనాడుకు చెందిన వినీ.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య పరిచయం ఏర్పడి, తర్వాత ప్రేమికులుగా మారారు.
దీంతో ఇప్పుడు పెళ్లి చేసుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ కొత్త జంటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టు కూడా పెట్టింది.