మేడే.. కరోనా క్రీనీడల్లో శ్రామికులకు అండ ఏదీ?  - MicTv.in - Telugu News
mictv telugu

మేడే.. కరోనా క్రీనీడల్లో శ్రామికులకు అండ ఏదీ? 

May 1, 2020

May day history on the eve of covid corona 

ఈరోజు మేడే. అంతర్జాతీయ కార్మిక దినోత్సం. కరోనా వైరస్ లేకుంటే ఎర్రజెండాలు రెపరెపలాడాల్సిన సమయం. కానీ కార్మికశక్తి ఇప్పుడు బితుకుబితుమని గుడుపుతోంది. పూటకింత తిండికోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వాల నుంచి సాయం కోరుతోంది. వేలమంది రోడ్లపై నడుతుస్తున్నారు. కోట్ల మంది నిత్యావసరాలు నోచుకోవం లేదు. 

ఇలాంటి పరిస్థితిలో ఘనత వహించిన మన ప్రభుత్వాలు వారిని ఆదుకోవడంలో విఫలమయ్యాయి. అరకొర సాయం తప్ప భవిష్యత్తుపై భరోసా కల్పించలేకపోతున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో  చేస్తున్న సాయాన్ని తమ సొంత జేబుల్లోంచి తీసిచ్చి డబ్బుగా ప్రచారం చేసుకుంటున్నారు. కరోనా అనంతరం కార్మికుల పరిస్థితి ఎలా ఉంబోతోందో తల్చుకుంటేనే భయంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోతారని అంతర్జాతీయ శ్రామిక సంఘం(ఐఎల్ఓ) అంచనా వేసింది.

కార్మికులకు ఇలాంటి కష్టనష్టాలు కొత్తకాదు. యుగాల తరబడి వారు అటు దోపిడీశక్తుల చేతుల్లో, ఇటు కరోనాలాంటి మహమ్మారు కోరల్లో అల్లాడుతూనే ఉన్నారు. కరోనాలోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యసిబ్బంది, పారిశ్రామిక సిబ్బందిని చూస్తే శ్రామిక శక్తి ధైర్యసాహసాలు, అంకిత భావం అర్థం చేసుకోవచ్చు. శ్రమజీవుల చెమటే ఇంధనంగా నడుస్తున్న ఈ ప్రపంచం కరోనా అనంతర కాలం వారికి చేయూతనివ్వాలని ఆశిద్దాం. శ్రమైక జీవన సౌందర్యాన్నిచాటే మేడే చరిత్రను గుర్తు చేసుకుందాం..

నెత్తుటి మడుగుల మీదుగా

మేడే! అది కొందరికి సెలవు. కొందరికి ఎర్రజెండాల కార్యక్రమం. కొందరికి జీవన పోరాటంలో దొర్లిపోయే ఒక రోజు. అంతేనా? అంతకు మించి ఏమీ కాదా? కార్మికులతో మాత్రమే దానికి సంబంధమా? కాదు. అది కేవలం శ్రామికుల పండగే కాదు, మనుషులందరీ పండగ. మేడే అంటే ఒక ఆశ, మేడే అంటే ఒక శ్వాస, మనుగడ కోసం, భవిష్యత్తు కోసం నెత్తుటిమడుగులపై సాగుతూ బిగించిన పిడికిలి. మనిషి పనికి బానిస కాదని, రోజుకు 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటల ఉల్లాసంగా ఉండాలన్న మహోదాత్త లక్ష్యం అది.

మేడే చరిత్ర తెలుసుకోవడానికి చరిత్రలోకే వెళ్లాల్సిన అవసరం లేదు. మానవ సమాజం ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ సంతరించుకున్నా, మనిషి అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నా.. ఇంకా  మనచుట్టూనే.. రాజ్యాంగం, హక్కులూ, హక్కుల కమీషన్లూ ఉన్న మన చుట్టూనే.. నిత్యం ఏ హక్కులూ లేకుండా గంటల తరబడి కాయకష్టం చేసే జనాలు కూడా ఆ చరిత్రను చెబుతారు. ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు, మారి తీరాలి అని అంటారు. అలాంటి ప్రశ్నలే మేడే ఆశయానికి పాదులు తీశాయి.

పనీ, పనీ, పనీ..

యూరప్, అమెరికాల్లో 19వ శతాబ్దిలో తొలి భాగంలో మొదలైన పారిశ్రామికీకరణ 1880ల నాటికి ఊపందుకుంది. లాభాలే ధ్యేయంగా పెట్టబడిదారులు దేశదేశాల్లోకి పరిశ్రమలు స్థాపించారు. అతి తక్కువ వేతనాలతో శ్రామికులతో పని చేయించేవారు. స్త్రీలు, పురుషులే కాకుండా పిల్లలుకూడా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. సూర్యుడిని చూడకుండానే జీవితాల కడతేరిపోయేవి. రోజుకు 18 గంటల శ్రమ ఫలితంగా అనార్యోగానికి గురయ్యేవారు. నిద్రసరిగ్గా లేకు, యంత్రభూతాల కోరలు తోముతూ వాటికి బలయ్యావాళ్లు. వైద్యానికి డబ్బుల్లేక చనిపోయేవారు. ఈ పరిస్థితి గమనించిన కార్మిక సంఘాలు ఉద్యమించాయి. 1830 నుంచే తమ స్థితిగతులను మెరుపర్చుకోడానికి కార్మికులు ఉద్యమిస్తూ వస్తున్నారు. పాలకులు వారిని ఉక్కుపాదంతో అణచేస్తున్నారు. ఎంత అణచివేసినా ఉద్యమాలు ఎప్పటికప్పుడు తలెత్తేవి. 18 గంటల పనిదినం 10 12 గంటలకు తగ్గింది. 1837లో అమెరికన్ ప్రభుత్వం 12 గంటల పనిదినాన్ని 10 గంటలకు తగ్గించింది.

 కానీ 10 గంటలు కూడా ఎక్కువే కనుక మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి. అమెరికాలోనే కాదు, యూరప్ దేశాల్లోనూ నిరసనలు సాగాయి. 8 గంటల పనిదినం మానవుడ జన్మహక్కు అంటూ నినదించారు. 1884లో శ్రామిక జనం రోడ్లెక్కారు. 1886లో ఏర్పాటైన అమెరికన్ నేషనల్ లేబర్ యూనియన్ దీన్ని సాధించడానికి దృడ సంకల్పంతో కదిలింది. అంతర్జాతీయ కార్మిసంఘాలతో కూడిన ఫస్ట్ ఇంటర్నేషనల్ 8 గంటల పనిదినం కోసం సంఘటిత ఉద్యమాలు సాగించింది.

1886 మే నెల తొలిరోజు నుంచి 8 గంటల పనిదినమే  ఉండాలని తన నాలుగో సభలో తీర్మానింది. దీన్ని సాధించడానికి అమెరికా కార్మిక సంఘం నాయకులు ఆ రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. షికాగో నగరం ఉద్యమానికి కేంద్రంగా మారింది. కార్మికులు ఫ్యాక్టరీలకు వెళ్లలేదు. రైళ్లు కదల్లేదు. దేశం స్తంభించింది. కానీ ప్రభుత్వానికి ఇలాంటి నిరసనలు కొత్త కాదు. అంతకుముందు యాభై ఏళ్లుగా సాగిన అణచివేత చరిత్ర దాని సొంతం.

షికాగో మే 4న కార్మికులు ఆనకట్ట తెంచుకున్న వరదలా రోడ్లపైకి వచ్చారు. హేమార్కెట్ స్క్వేర్‌లో మిలిటెంట్ కార్మికులు చేరారు. అంతకు ముందు రోజు పోలీసులు కాల్పుల్లో చనిపోయిన సహచరులకు నివాళి అర్పిస్తున్నారు. చుట్టూ పోలీసులు డేగ కళ్లతో చూస్తున్నారు. ఉన్నట్టుండి ఓ పోలీసుల వైపు నుంచి ఓ బాంబు ఎగిరొచ్చి పేలింది. పోలీసు తుపాకులు గర్జించాయి. ఏం జరుగుతోందో కొన్ని నిమిషాల పాటు ఎవరికీ అర్థం కాలేదు.. కాల్పుల మోత ఆగిన తర్వాత నలుగురు కార్మికులతోపాటు ఏడుగురు పోలీసులు విగత జీవులుగా మారారు. ప్రభుత్వం తర్వాత పగతో రగిలిపోయిది. ముగ్గురు కార్మిక నాయకులను ఉరితీసింది. కానీ, మేడే స్ఫూర్తి ఆగిపోలేదు. 8 గంటల నినాదం భూగోళంలో మనుషులు జీవిస్తున్న ప్రతిచోటా మార్మోగింది.

 

మేడే స్ఫూర్తితో.. ఫ్రెంచి విప్లవ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని జూలై 141889లో పారిస్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్‌ను పునరుద్ధరించారు. అలా మొదలై రెండో ఇంటర్నేషనల్ 1890 నుంచి మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున కార్మికులు సెలవు దీసుకుని నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.

ఎర్రజెండా ఎందుకంటే? 

ఎర్రజెండా కార్మికుల ఐక్యతకు, ఆశయాలకు ప్రతీక. వారు ఒలికిచిన నెత్తుటి దీపిక 1840 దశకం నుంచే కార్మిక సంఘలు దాన్ని తమ పతాకంగా ప్రకటించకున్నాయి. షికాగో హేమార్కెట్ స్క్వేర్‌లో చిందిన నెత్తురు, ఆ తర్వాత ఉరితీయబడిన కార్మిక నేతల బలిదానం, ప్రపంచ వ్యాప్తంగా శ్రమజీవుల బలిదానాలు ఆ జెండాను మరింత ఎరుపెక్కించాయి. శ్రమకు అది సంకేతమైంది. 1917లో రష్యన్ విప్లవం విజయవంతం అయ్యాక ఎర్రజెండా ప్రపంచం నలుమూలలకూ చేరి రెపరెపలాడింది.