డాన్స్‌ చేస్తూ ట్రాఫిక్‌ కంట్రోల్.. ఎంబీఏ అమ్మాయి వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

డాన్స్‌ చేస్తూ ట్రాఫిక్‌ కంట్రోల్.. ఎంబీఏ అమ్మాయి వీడియో వైరల్

November 19, 2019

కొందరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్ధతుల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన రంజీత్ సింగ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫ్రెడ్డిల్ మెర్క్యురీ డాన్స్ స్టైల్‌తో ట్రాఫిక్ జామ్‌ని కంట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వారి జాబితాలోకి అదే నగరం నుంచి ఎంబీఏ విద్యార్థిని షుబి జైన్ వచ్చి చేరింది. 

తను డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది. అలాగే ప్రజల్లో ట్రాఫిక్‌, రోడ్డు రూల్స్‌పై అవగాహన కల్పిస్తోంది. దీంతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తన ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఆమె వాలంటీర్‌గా ట్రాఫిక్ కంట్రోల్ మొదలుపెట్టింది. రంజీత్ సింగ్‌ని ఆదర్శంగా తీసుకున్న షుబీ డాన్స్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నానని చెబుతోంది. రద్దీ రోడ్లపై రకరకాల స్టెప్స్ వేస్తూ వాహనాలు సజావుగా వెళ్లిపోయేలా చేయడం సరదాగా ఉందంటోంది. ఎప్పుడూ లేనిది ఓ అమ్మాయి ఇలా డాన్స్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండడంతో వాహనదారులు ఆశ్చర్యపోతూ చూస్తూ వెళుతున్నారు.