విషవాయువుకు ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థి బలి - MicTv.in - Telugu News
mictv telugu

విషవాయువుకు ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థి బలి

May 7, 2020

MBBS Student Visakhapatnam Gas Incident 

విశాఖ విషవాయువు విషాదం పెను విధ్వంసం సృష్టించింది. ఎంతో మంది భవిష్యత్‌పై ఇది నీళ్లు చల్లింది. కొండంత ఆశతో ప్రజలకు సేవ చేసే వైద్య వృత్తిని చేపట్టాలని అనుకుంటున్న ఎంబీబీఎస్ విద్యార్థిని బలి తీసుకుంది. ఈ విష వాయువు పీల్చుకొని చంద్రమౌళి అనే ఫస్టియర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. డాక్టర్‌గా ఎదిగిన తర్వాత ఎంతో మందికి ప్రాణాలు పోస్తాడనుకున్న కొడుకు తమ కళ్ల ముందే రాలిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నారు. 

ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో నివాసం ఉంటున్న చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అతడు ప్రాణాలు వదలడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మరణించగా… వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా చాలా మంది స్ప్రహతప్పి ఇళలలోనే పడిపోవడంతో వారిని గుర్తించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. పక్షులు, జంతువులు ఎక్కడికక్కడ మరణించడంతో ఆ మృతదేహాలను తొలగించే పనులు చేపట్టారు.