గుడ్ న్యూస్.. ఇక MCA రెండేళ్లే - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్.. ఇక MCA రెండేళ్లే

July 8, 2020

nvgmn

విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి శుభవార్తను వినిపించింది. ఇక నుంచి మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA) చదవాలనుకునే వారికి మరింత సులభతరం చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కేవలం రెండేళ్లలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో మూడేళ్ల పాటు చదవాల్సిన కోర్సు కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసే అవకాశం విద్యార్థులకు లభించింది. 

2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆరు సెమిస్టర్లకు బదులు రెండు సంవత్సరాల్లో 4 సెమిస్టర్లు పూర్తి చేస్తేనే పట్టా ఇవ్వనున్నారు.  MCA కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. కోర్సు వ్యవధి కుదింపునకు గతేడాదే ఆమోద ముద్ర లభించడంతో ఈ సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.