MCD polls: Denied ticket, ex-AAP councillor climbs tower, threatens to kill himself
mictv telugu

టిక్కెట్ ఇవ్వలేదని హైటెన్షన్ టవర్ ఎక్కిన మాజీ కార్పోరేటర్

November 13, 2022

పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో హైటెన్షన్ టవర్ ఎక్కాడు ఓ మాజీ కార్పొరేటర్‌. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. అంతే కాదు సొంత పార్టీ తప్పుడు విధానాలను ఎత్తిచూపాడు. అధిష్టానం మోసం చేసిందంటూ.. చేసిన కృషికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిరసనకు ఆ మాజీ కార్పోరేటర్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత.

డిసెంబర్ 4న జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో(ఎంసీడీ) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ, తుది విడత జాబితాలో 117 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ శనివారంనాడు ప్రకటించింది. ప్రజా వాణే పార్టీ వాణి అని, సర్వేలో ప్రజలు సూచించిన పార్టీ పాత కర్యకర్తలకే రెండో జాబితాలో చోటు కల్పించింది. టిక్కెట్‌ను ఆశిస్తూ 20,000 మందికి పైగా ఆప్ కార్యకర్తలు దరఖాస్తు చేసుకోగా.. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సుదీర్ఘ సమావేశం జరిపి అభ్యర్థులను ఖరారు చేసింది.

ఈ క్రమంలోనే తనకు టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో మాజీ కార్పొరేటర్‌ హసీబ్‌ ఉల్‌ హసన్‌ నిరసనకు దిగారు. ఢిల్లీలోని శాస్త్రి నగర్‌ పార్క్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న హైటెన్షన్‌ టవర్‌ ఎక్కి నిరసనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. కేజ్రీవాల్‌ తనను మోసం చేశారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.