మెన్ టూ .. పిడికిలి బిగించిన  భార్యాబాధితులు - MicTv.in - Telugu News
mictv telugu

మెన్ టూ .. పిడికిలి బిగించిన  భార్యాబాధితులు

October 22, 2018

అత్యాచార, లైంగిక వేధింపులకు గురైన మహిళలు ప్రారంభించిన మీటూ ఉద్యమం ఎన్ని సంచలనాలు సృష్టిస్తోందో, ఎందరు సెలబ్రిటీల ముసుగులు వలిచేస్తోందో వివరించాల్సిన పనిచేదు. అయితే నాణేనికి రెండో వైపూ ఉన్నట్లు కొందరు పురుషులు కూడా మాపైనా లైంగిక వేధింపులు సాగయంటూ గోడు వెళ్లబోసుకున్నారు. తాజాగా తాజాగా భార్యలతో నరకయాతన అనుభవిస్తున్న భర్తలు కూడా ఉద్యమం మొదలు పెట్టారు.Me Too movement started in Bengaluru to protect wife victims husbands and false cases NGO CRISP (Children’s’ Rights Initiative for Shared Parenting), and also in attendance was Pascal Mazurier‘మెన్ టూ’ పేరుతో ఆదివారం బెంగళూరులో ఈ మహోద్యమం మొదలైంది.  క్రిస్ప్ అనే స్పచ్ఛంద సంస్థ దీనికి పురుడు పోసింది.  సంస్థ నిర్వాహకుడు, స్టాక్ మార్కెట్ నిపుణుడు  కుమార్ జాగిర్దార్.. మరో 15 మందితో కలిసి దీన్ని మొదలెట్టాడు. తమదిమీటూకు పోటీ కాదని, కేవలం తమ హక్కుల కోసమే దీన్ని ప్రారంభించామన్నారు. ‘కొంతమంది భార్యలు..  తప్పుడు కేసులు, ఆరోపణలతో భర్తలను హింసిస్తున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. బాధితులందరూ ఏకతాటిపైకి వస్తే సమస్యలను చేదోడువాదోడుగా పరిష్కరించుకోవచ్చు.. ’ అని ఆయన అన్నారు. అమాయక భర్తలను రాచిరంపాన పెడుతున్న  గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలలో సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగిర్దార్ డిమాండ్ల వెనక పెద్ద కథే ఉంది. భార్య ఇంట్లోంచి వెళ్లిపోయి ఓ క్రికెటర్ను పెళ్లాడింది. కూతురును కూడా తనతోపాటు తీసుకెళ్లింది. అయితే జాగిర్దార్ కోర్టు కెక్కి, కూతురిని తెచ్చుకున్నాడు. ఇక మెన్ టూను స్థాపించిన వారిలో  ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ కూడా ఉన్నారు. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భార్య అతనిపై కేసు పెట్టింది. అయితే ఇది వొట్టి అబద్ధమని కోర్టు తేల్చింది. మెన్ టూ బార్యాబాధితుల పిల్లలతో పాటు కొంత మహిళలు కూడా జైకొట్టారు.