మనకు తెలిసినంత వరకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ను బండ్లలో నింపుతారు. కానీ ఓ పెట్రోల్ బంక్ లో బండిలో పెట్రోల్ తో పాటు కడుపూ నింపుకోవచ్చు, అదిగుడ ఫ్రీ గా. బెంగుళూరులో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
‘యూ ఫిల్ యువర్ ట్యాంక్! వి ఫిల్ యువర్ టమ్మీ’ పేరిట పెట్రోల్ బంకును బంక్ విత్ హోటల్ టైప్ లో మార్చేశారు. అయితే ఓ నెల రోజులపాటు పెట్రోల్ పోసుకోవడానికి వచ్చేవారికి ఉచితంగా భోజనాన్ని పెడతారట. నెల తర్వాత మీల్స్ కు తక్కువ మొత్తం చార్జ్ చేస్తారట. ఈ బంకులో వెజ్, నాన్ వెజ్ రెండింటినీ అందిస్తున్నారు. దీనికోసం బంకులో ఓ ప్రత్యేక కిచెన్ కూడా ఏర్పాటు చేశారట. పెట్రోల్ పోసుకోనివారు కూడా ఈ బంక్ హోటళ్లో భోజనం చెయ్యచ్చట. రానున్న రోజుల్లో బెంగుళూరు సిటీలోని మరో 100 బంకులలో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తారట. వీళ్ల ఆలోచన భలే ఉందికదా … అటు బండి ఇటు మన కడుపు.. ఒకేసారి నింపుకోవచ్చు.