Home > Featured > తిరుమలకు మద్యం, మాంసం..

తిరుమలకు మద్యం, మాంసం..

tirumala

హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో మద్యం, మాంసం నిషేధమన్న సంగతి తెల్సిందే. అయినా కూడా కొందరు దుండగులు దొంగదారుల్లో వెంకన్న సన్నిధికి వీటిని తరలిస్తున్నారు. తాజాగా తిరుమలకు వెళ్లే మార్గంలోని అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర మద్యం, మాంసం పట్టుపడడం కలకలం రేపుతోంది.

తిరుమలలో గతంలో మీడియాలో కెమెరా మెన్ గా పనిచేసిన ఎన్‌.వెంకటముని ప్రయాణిస్తున్న ఇండికా కారు సీటు కింద మద్యం, మాంసం దొరికాయి. అలిపిరి తనిఖీ కేంద్రంలో ఏవీఎస్‌వో సురేంద్ర ఆధ్వర్యంలో విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా సీట్‌ కింది భాగంలో మద్యం, మాంసం దొరికాయి. దీంతో వెంకటమునిని తిరుమల టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 13 May 2020 8:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top