ద్యావుడా... నాన్‌వెజ్ ఐస్ క్రీమ్ వచ్చేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా… నాన్‌వెజ్ ఐస్ క్రీమ్ వచ్చేసింది.. 

October 21, 2020

Meat Ice cream Scientists have created a meat-flavoured ice-cream – it's all too real.jp

‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో..’ అనే పాట తెలుసుకదా. అందరిలాగా ఉంటే తమ గొప్పేం ఉంటుందని కొందరు కొత్తకొత్త సైళ్లు ప్రదర్శస్తుంటారు. హెయిర్ కటింగ్ నుంచి డ్రస్సింగ్ వరకు మనం ఎంత వెరైటీగా ఉంటే, అంతగా అందరి కళ్లలో పడతామని కుర్రకారులో ఓ మూఢనమ్మకం బాగా ఉంది. 

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. కొందరికి మాంసాహారం ఇష్టం, కొందరికి శాకహారం ఇష్టం. కొందరికి రెండూ ఇష్టం. ఆహారంలాగే ఐస్ క్రీముల్లోనూ రకరకాలు ఉన్నాయి. స్ట్రాబెరీ, వెనీలా, మ్యాంగో.. రకరకాల రుచుల్లో అందుబాటులో ఉన్నాయి. అయినా కొందరికి తీవ్ర అసంతృప్తి కలిగింది. ‘ఇన్నేసి ఫ్లేవర్లు ఉన్నాయి సరే మాకు నచ్చడం లేదు. మాకు మాంసం అంటే చాలా ఇష్టం. ఐస్‌క్రీమ్‌ను నాకితే అచ్చం మాంసాన్ని నాకినట్టే ఉండాలి.. అలాంటిది కావాలి..’ అని మొరపెట్టుకున్నారు. ఇంకేముంది, ఓ కంపెనీ బాగా కష్టపడి మాంసాహార హిమక్రీములను తయారు చేసింది. 

 ష్యాకు చెందిన మిన్స్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీట్ అండ్ డైరీ సంస్థ ఈ నాన్‌వెజ్ ఈ ఐస్‌క్రీమ్‌ను  తయారు చేరసింది. దీన్ని తింటే అచ్చం మాంసపు ముద్దను తింటున్నట్టే ఉంటుందట. అయితే ఇందులో ఓ షాకింగ్ విషయం కూడా ఉంది. ఈ ఐస్‌క్రీమ్‌లో అసలు ఏ మాంసమూ ఉండదు. చికెన్, మటన్ ఫ్లేవర్లు మాత్రమే ఉంటాయి. నేతిబీరకాయలో నెయ్యిలాగా అన్నమాట. ఇందులో చక్కెర పదార్థాలు కూడా అసలు ఉండవు ఈ ఏడాది బెలాగో నగరంలో జరిగిన ఎగ్జిబిషన్‌తో ఈ మాంస క్రీమ్‌ను ప్రదర్శించగా జనం రకరకాలుగా ముఖాలు పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మాంసం తినాలనే కోరిక ఉంటే నేరుగా మాంసమే తినొచ్చుగా, దీన్ని నాకడం దండగ కాకపోతే అని కొందరు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, మాంసాహారం ఇష్టం లేని శాకాహారులుకు ఇది మేలే కదా అని కొందురు సమర్థిస్తున్నారు. ఇటీవల రసగుల్లాతో బిర్యానీ వంటకం, చాక్లెట్ దోశ, గులాబ్ జామూన్ దోశలు హల్‌చల్ చేయడం తెలిసిందే.