హైదరాబాద్‌లో మాంసం షాపులు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో మాంసం షాపులు బంద్

April 23, 2021

Meat non-vegetarian shops close in Hyderabad mahavir jayanti

మాంసాహార ప్రియులకు అశుభ వార్త. కరోనా సెకండ్ వేవ్ కేసుల సంఖ్య పెంచి, ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 25 ఆదివారం మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. సాధారణంగా మహావీర్ జయంతిని నిషేధం ఉన్నా పెద్దగా అమల్లోకి ఉండదు. అయితే ఈసారి కరోనా పెచ్చరిల్లడంతో పకడ్బందీగా అమలు కానుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలతోపాటు, మాంసం, బీఫ్ దుకాణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో బంద్‌ను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. సోమవారం ఎప్పట్లాగే కళేబాలు, మాంసం దుకాణాలను తెరుచుకోవచ్చన్నారు. కోళ్ల వల్ల కరోనా వ్యాపిస్తుందని గత ఏడాది ప్రచారం జరగడంతో వాటి ధర బాగా తగ్గింది. అయితే ఈ ఏడాది కొండెక్కి కూర్చుంది. చికెన్ వల్ల కరోనా రాదని శాస్త్రవేత్తలు చెప్పడం, అది మేలు చేస్తుందని ప్రచారం జరగడంతో జనం ఎగబడుతున్నారు. దీంతో కేజీ ధర రూ. 280 దాకా వెళ్లింది. ప్రస్తుతం 220కి అమ్ముతున్నారు.