తీర్పుకు, రాజీనామాకు సంబంధం లేదు.. జడ్జి రవీందర్ - MicTv.in - Telugu News
mictv telugu

తీర్పుకు, రాజీనామాకు సంబంధం లేదు.. జడ్జి రవీందర్

April 16, 2018

మక్కా మసీదు పేలుళ్ల కేసులో సోమవారం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన నాంపల్లిలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్డు జడ్జి రవీందర్ రెడ్డికి తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తీర్పుకు, తన రాజీనామాకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని కొంతకాలంగా ఆలోచిస్తున్నానని అన్నారు.

జస్టిస్ రవీందర్ రెడ్డి గతంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కోసం జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించి సస్పెండ్‌ అయ్యారు. దీంతో హైకోర్టు ఏర్పాటులో జాప్యానికి నిరసనగా ఆయన రాజీనామా చేసి ఉండొచ్చని వార్తలు వచ్చాయి. రాజీనామా లేఖలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించరాని కథనాలు వెలువడ్డాయి.