మక్కా మసీదు పేలుళ్ల కేసు జడ్జి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

మక్కా మసీదు పేలుళ్ల కేసు జడ్జి రాజీనామా

April 16, 2018

సంచలనం సృష్టించిన హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన నాంపల్లి ఎన్ఐఏ కోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తీర్పు ఇచ్చి కొన్ని గంటలు గడవకముందే తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అంతేకాకుండా 15 రోజులలు తాను సెలవుపై వెళ్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దేవేందర్‌గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ భాయి, రాజేందర్‌చౌదరిలను జస్టిస్ రవీందర్ రెడ్డి నిర్దోషులుగా ప్రకటించారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో కేసునుంచి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  

9 మంది పేలుళ్లలో, తర్వాత జరిగిన అల్లర్లలో మరో 9మంది చనిపోవడం తెలిసిందే. నిందుతులను నిర్దోషులుగా ప్రకటించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు విమర్శలు సంధిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాస్తోందని ఆరోపిస్తున్నారు.