మక్కా మసీదులో అపచారం.. గేమ్ ఆడిన మహిళలు - MicTv.in - Telugu News
mictv telugu

మక్కా మసీదులో అపచారం.. గేమ్ ఆడిన మహిళలు

February 20, 2018

ముస్లింలు అత్యంత్య పవిత్రంగా భావించే మక్కా మసీదులో కనీవినీ ఎరగని అపచారం జరిగింది. బురఖా వేసుకున్న మహిళలు ఒకచోట నింపాదిగా కూర్చుని బోర్డు గేమ్ ఆడారు. పశ్చిమ కూడలిలోని కింద్ అబ్దుల్ అజీజ్ గేటువద్ద గత శుక్రవారం ఉదయం ఈ ఉదంతం జరిగింది.

భద్రతా సిబ్బంది చాలాసేపు ఆ తతంగాన్ని గమనించలేదు. తర్వాత వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పారు. మక్కా పవిత్రతను దెబ్బతీయొద్దని, అక్కడి నుంచి లేచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో గేమ్ సామగ్రి మొత్తం సర్దుకుని ముఖాలు మాడ్చుకుంటూ వెళ్లిపోయారు. ఈ గేమ్ వ్యవహారంపై దీనిపై మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మసీదు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని, అసలు ఆ మహిళలు బోర్డు గేమ్ సామగ్రితో లోపలికి ఎలా వచ్చారని విరుచుకుపడుతున్నారు.