రేపిస్ట్ మెకానిక్.. అలాంటి వారితో  జాగ్రత్త..! - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్ట్ మెకానిక్.. అలాంటి వారితో  జాగ్రత్త..!

February 3, 2018

పాడైన వాషింగ్ మిషన్ రిపేర్‌‌ను చేయడానికికొచ్చిన మెకానిక్ గృహిణిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ బాచుపల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రగతి నగర్‌కు చెందిన ఓ గృహిణి ఇంట్లో వున్న వాషింగ్ మిషన్ ఐదు నెలల క్రితం పాడైంది. దీంతో ఇంటర్నెట్ ద్వారా మియాపూర్‌లోని  ఓ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించింది. యజమానికి బదులు అతని మిత్రుడు పవన్ తేజ్ రెడ్డి ( 24 ) ఆమెతో ఫోన్‌లో మాట్లాడి స్కెచ్ వేసుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళాడు. ఏవేవో సాకులు చెప్పి రిపేర్ వాయిదా వేస్తూ వెళ్లాడు. అలా నాలుగైదు సార్లు ఆమె ఇంటికెళ్లాడు. ఓ ఇంట్లో ఎవరూ లేరని గమనించి  ఆమె ముఖం మీద మత్తు మందు చల్లాడు.  స్పృహ కోల్పోగానే ఆమె బట్టలు తీసి నగ్నంగా పోటోలు తీసి ఆమెని బెదిరించడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు ఆమె మీద అత్యాచారం చేశాడు.ఇంకా బెదిరింపులకు దిగి రూ. 35 వేలు కూడా గుంజాడు. నిందితుడి ఆగడాలు శ్రుతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు గత నెల 19న పవన్‌తేజ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. అతడిపై 376, 384, సాంకేతిక చట్టం 72 కింద కేసు నమోదు చేశారు.

మహిళలు ఇంట్లో  ఒంటరిగా వున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మరమ్మత్తుల పేరిట, కేబుల్ ఆపరేటర్లమని, ప్లంబర్లమని వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే మహిళలు తోడుగా పక్కింటి వాళ్ళను పిలుచుకుంటే మంచిది.
  • ఇంట్లో భర్త, పెద్దులు ఎవరైనా వున్నప్పుడే ఇలాంటి పనులు పెట్టుకోవడం ఉత్తమం.
  • ఎవరైనా తమ నగ్నగా ఫోటోలు తీశామని బెదిరిస్తే మహిళలు ‘ అయ్యో నా ఇజ్జత్ పోతుందని ’ భయపడి, అతడికి లొంగకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ఇలాంటి దారుణాలు జరగవు అంటున్నారు పోలీసులు.