హెల్మెట్లు పెట్టుకోని పాఠాలు చెప్పిన టీచర్లు..! - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్లు పెట్టుకోని పాఠాలు చెప్పిన టీచర్లు..!

July 21, 2017

ఇదేదో రోడ్ సెఫ్టీలో భాగం కాదు. ప్రమాదాల నివారణకు చేస్తున్న ప్రచారమూ కాదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనాన్ని బాగు చేయాలని టీచర్లు హెల్మెట్లు పెట్టుకున్నారు.క్లాస్ రూమ్ లో కూర్చోవాలంటే వణికిపోతున్నామని , ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులు , అధికారుల దృష్టికి తీసుకెళ్లిle పట్టించుకోవడం లేదని టీచర్లు, విద్యార్థులు వాపోతున్నారు. వానొస్తే డేంజర్ జోన్లుగా మారిన క్లాస్ రూమ్ లో,లేదంటే చెట్ల కింద చదువు చెబుతున్నారు. ఇది ఎక్కడో తెలుసా…

ఇది మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల భవనం చాలా పాడుపడిపోయింది. స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. క్లాస్ రూమ్ లు అన్ని డేంజర్ జోన్లుగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతోందని విద్యార్థులు , టీచర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో కొన్నిసార్లు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. అయినా గత్యంతరం లేక టీచర్లు ఇందులోనే పాఠాలు చెప్పాల్సివస్తోంది. వాన రాకపోతే మాత్రం చెట్ల కింద చదువులు చెబుతున్నారు.వానొస్తే ఎక్కడ బిల్డింగ్ కూలిపోతుందోనని భయపడి సెలవు ఇచ్చేస్తున్నారు.

ఈ స్కూల్ లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 664 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 443 మంది బాలురు, 219 మంది బాలికలు. ఇక్కడ పిల్లలకు టాయ్ లెట్స్ కూడా సరిగ్గా లేవు. గతేడాది తనిఖీకి వచ్చిన అధికారుల దృష్టి కి ఈ విషయం తీసుకెళ్లారు.దీంతో వీటి నిర్మాణం కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎందుకంటే స్మాల్ బడ్జెట్ అని హెడ్ మాస్టర్ రమేష్ చెబుతున్నారు. మూడేళ్లుగా ఈ సమస్య ఉందని, ఈ ఏడాది పరిష్కారిస్తామని డీఈఓ అంటున్నారు.

స్కూల్ దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.దీంతో హెల్మెట్లు పెట్టుకుని పాఠాలు చెబుతూ టీచర్లు నిరసన తెలిపారు. ఈ ఘటన పై స్పందించిన సర్పంచ్ కుమార్ గౌడ్ ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేని ఒప్పించి కొత్త స్కూల్ బిల్డింగ్ కు త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని చెబుతున్నారు.

సీ ఎం కేసీఆర్ సారూ మీ జిల్లాలో ఇలాంటి స్కూల్ ఉండటం ఎంది. మీ దృష్టికి ఇది వచ్చినట్టు లేదు..జర ఇప్పుడైనా నజర్ పెట్టండి…చకచకా బిల్డింగ్ కట్టేయామని కలక్టర్ కు ఆర్డర్ వేయండి సారూ…విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు సంతోషిస్తారు…