వరి నాటిన కలెక్టర్..! - MicTv.in - Telugu News
mictv telugu

వరి నాటిన కలెక్టర్..!

July 3, 2017

కలెక్టర్ అంటే సూట్ బూట్ ..కారు నుంచి కాలు కింద పెట్టారు. ఎంతో అవసరం పడితే తప్ప సామాన్యులతో మాట్లాడారు.ఆఫీసుకెళ్తే గంటలకొద్దీ వెయిట్ చేస్తేగానీ కలెక్టర్ టైమ్ ఇవ్వరు. ఇదంతా ఒకప్పుడు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక…కలెక్టర్లుగా చాలా మంది యువ ఆఫీసర్లకు చాన్స్ వచ్చింది. వాళ్లకు టైమ్ దొరికిందంటే చాలు జనంలోకి వెళ్తున్నారు. వారి సమస్యల్ని తెలిసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి, వరంగల్ ఆర్బన్  కలెక్టర్ ఆమ్రపాలి బాటలో మరో కలెక్టర్ ఓ అడుగు ముందుకేశారు..ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరంటే..

మెదక్ జిల్లా కలెక్టర్ భారతిహోళీకేరి పొలం బాట పట్టారు. రైతులు వ్యవసాయ పనులు ఎలా చేస్తారో చూడడానికి అవుసులపల్లి గ్రామానికి వెళ్లారు. నాగారం మల్లేశం అనే రైతుకు చెందిన పొలంలో కలెక్టర్ భారతి వరి నాటు వేశారు. రైతులు ఎక్కువగా ఆర్గానిక్ వ్యవసాయం వైపే మొగ్గు చూపాలని సూచించారు. రైతులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ వ్యవసాయమే చేయాలని చెప్పారు. దీంతో క్యాన్సర్‌తో పాటు ఇతర రోగాలు రావన్నారు. ఆ తర్వాత భూమి యజమానితో మాట్లాడారు. పొలంలో నాటు వేస్తున్న కూలీలతో కొద్దిసేపు ముచ్చటిస్తూ జిల్లా కలెక్టర్ భారతిహోళీకేరి కూడా నాటు వేశారు. ఆమె కూతురు కూడా సరదాగా నాటు వేసే ప్రయత్నం చేసింది.

కలెక్టర్ భారతిహోళీకేరి సూపర్. పొలానికెళ్లి రైతులతో ముచ్చటించడంపై గ్రామస్తులు సంతోషపడుతున్నారు. ఇలాగే మిగతా కలెక్టర్లు రైతుల దగ్గరకి వెళ్లి మాట్లాడితే వారిలో చైతన్యం రావడమే కాదు…అన్నదాతల్లో దైర్యం నింపిన వారవతారు. కిపిటప్ కలెక్టర్ ..