మేడారం జాతర విశేషాలు..శునకానికి నిలువెత్తు బంగారం..! - MicTv.in - Telugu News
mictv telugu

మేడారం జాతర విశేషాలు..శునకానికి నిలువెత్తు బంగారం..!

February 3, 2020

dog....

రెండేళ్ల కోసారి తెలంగాణలో కుంభమేళాను తలపించేలా జరిగే మేడారం జాతరకు అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వనదేవతల జాతర మహత్తరంగా ప్రారంభం కానుంది. దాని కంటే ముందు నుంచే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని తమ మొక్కులను చెల్లిస్తున్నారు. బంగారం( బెల్లం) ముద్దలు తెచ్చి నైవేథ్యాలు సమర్పిస్తున్నారు. తాజాగా ఓ జంట అమ్మవార్లకు వెరైటీగా బంగారం సమర్పించారు. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ జంట మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికివచ్చి ఆనవాయితీగా మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఓ శునకానికి సరితూగేలా బంగారం సమర్పించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంట్లో తాము పెంచుకున్న ఈ శునకం గతంలో కనిపించకుండా పోయిందట. ఆ సమయంలో ఆ శునకం మళ్లీ తమకు దొరకాలని సమ్మక్క-సారలమ్మకు మొక్కుకున్నారట. దీంతో అది రెండు రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకోవడంతో శునకంతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవార్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు.