మేడారానికి పయనమైన పగిడిద్దరాజు.. భక్తుల కోలాహలం - MicTv.in - Telugu News
mictv telugu

మేడారానికి పయనమైన పగిడిద్దరాజు.. భక్తుల కోలాహలం

February 4, 2020

nbhbc

పచ్చటి అడవిలో వనదేవతల జాతరకు అంతా సిద్ధమైంది. కుంభమేళాను తలపించేలా రెండేళ్లకోసారి మూడు రోజులపాటు జరిగే మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు జాతర జరగనున్నప్పటికీ ఇప్పటికే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి పయనం అయ్యారు. ఆరెం వంశీయులు, యాపలగడ్డ గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తున్నారు.

జాతర ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఆరెం వంశీయులు కాలినడకన పగిడిద్దరాజును మేడారానికి తీసుకువస్తారు. డోలీల చప్పుళ్లతో, సంప్రదాయ నృత్యాలతో రేపు సాయంత్రం మేడారం చేరుకోనున్నాడు. ఆ తర్వాత పగిడిద్దరాజు ఆభరణాలకు పూజలు చేసి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత సారక్కను చిలకల గుట్టపై నుంచి తీసుకువచ్చి గద్దెపైకి చేరుస్తారు. అదే రోజు పగిడిద్దరాజు – సమ్మక్కల వివాహం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రెండు రోజుల వేడుక తర్వాత నాగవెల్లి జాతర నిర్వహిస్తారు. వన దేవతలను తిరిగి వనంలోకి పంపించడంతో అధికారికంగా జాతర ముగుస్తుంది. ఆపై పగిడిద్ద రాజు తిరుగు పయనం అవుతాడు.