మేడారానికి హెలికాప్టర్లో వెళ్తారా? జస్ట్ 14 వేలే! - MicTv.in - Telugu News
mictv telugu

మేడారానికి హెలికాప్టర్లో వెళ్తారా? జస్ట్ 14 వేలే!

January 31, 2018

ఆసియాలో అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్క జాతరను చూడాలని ఎవరికి ఉండదు? అయితే దూరాభారం అని కొందరు ఆ కోరికను చంపేసుకుంటారు. మరికొందరికి తీరిక ఉండదు.. ఇలాంటి వారికోసం తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెట్ హెలికాప్టర్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.రూ. 13,999 చెల్లిస్తే హన్మకొండ నుంచి మేడారానికి కేవలం తీసుకెళ్తారు. రోడ్డు మార్గంలో వాహనాల్లో వెళ్లాలంటే రెండు గంటలు పడుతుంది. ఒక్కో ట్రిప్పుకు ఆరుగురిని తీసుకెళ్తారు. కేవలం జాతరకు వెళ్లడానికి రూ. 6999 చెల్లించాలి. జాతర నుంచి తిరిగి రావడానికి కూడా అంతే మొత్తం చెల్లించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు హెలికాప్టర్లను తిప్పుతారు. సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి ఇవి బయల్దేరతాయి. ప్రయాణికులను మేడారంలోని పగిడాపూర్‌ హెలిప్యాడ్‌ నుంచి గద్దెల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయిస్తారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3వరకు హెలికాప్టర్లు తిరుతాయి.

 నింగి నుంచీ చూడొచ్చు..

మేడారం జాతరను నింగి నుంచి చూసే అవకాశాన్ని తుంబి కంపెనీ కల్పిస్తోంది. రూ. 2,599 చెల్లిస్తే 8 నిమిషాలు జాతరను హెలికాప్టర్ నుంచి చూపిస్తారు. టికెట్ల బుకింగ్ కోసం 86298-93491 నంబర్ కు ఫోన్ చేయాలని, లేదా, మేరాఈవెంట్స్‌.కామ్‌ వెబ్ సైట్‌లో బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది