మేడారంలో ఛత్తీస్ సీఎంకు అవమానం - MicTv.in - Telugu News
mictv telugu

మేడారంలో ఛత్తీస్ సీఎంకు అవమానం

February 1, 2018

మేడారం సమ్మక్క, సారక్క జాతరకు జనం పోటెత్తారు. వివిధ రాష్ట్రాల్లోని గిరిజనులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా గురువారం వనదేవతలను సందర్శించుకోవడానికి వచ్చారు. అయితే ముందస్తు ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో ఆయనకు అవమానం ఎదురైంది.రమణ్ సింగ్ వచ్చినప్పుడు క్యూ లైన్‌ను నిలిపేయకుండా అలాగే కొనసాగించారు. దీంతో భక్తులు సమ్మక్క గద్దెపై విసిరిన కొబ్బరికాయల్లో కొన్ని ఆయనపైకి దూసుకొచ్చాయి. అయితే సీఎం సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన ముప్పు తప్పింది.

దీన్ని అవమానంగా భావించిన సీఎం పర్యటనకు అక్కడితో ముగించుకుని సారలమ్మ గద్దెను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. భద్రత కారణాల వల్ల త్వరగా వెనక్కి వెళ్లిపోవడమే మంచిదని సీఎంకు భద్రత కల్పిస్తున్న ఎన్ఎస్జీ బలగాలు కూడా ఆయనకు సూచించాయి. రమణ్ సింగ్ అభిమానులు, ఛత్తీస్ గిరిజనులు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛత్తీస్ సీఎంకు తెలంగాణ పోలీసులు భద్రత కల్పించలేదన్నారు.