అనూష ఎఫైర్.. అప్పుడు కూతురి హత్య, ఇప్పుడు భర్త ఆత్మహత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

అనూష ఎఫైర్.. అప్పుడు కూతురి హత్య, ఇప్పుడు భర్త ఆత్మహత్య..

July 11, 2020

Medchal

అక్రమ సంబంధం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ప్రియుడిపై మోజు పడి అతని చేతిలో కూతుర్ని కోల్పోయిన అనూష ఈ రోజు భర్తను కూడా కోల్పోయింది. ఆమె భర్త రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబంధాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఇందుకు మించిన ఉదాహరణ లేదు. 

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌కు చెందిన అనూష కరుణాకర్ అనే యవకుడికితో అక్రమ సంబంధం కొనసాగించింది. తర్వాత కుటుంబంలో గొడవల వల్ల అతణ్ని దూరం పెట్టింది. దీన్ని తట్టుకోలేని కరణాకర్ వారం కిందట అనూష ఇంటికెళ్లి ఆమె ఆరేళ్ల ఆద్యను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపాడు. కూతురి హత్యతో కుటుంబం కుదేలైంది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అనూష భర్త కల్యాణ్ కూతుర్ని తలచుకుని కుమిలిపోయాడు. ఆయన ఈ రోజు భువనగిరి లో రైలు కింద పడి చనిపోయాడు. అనూషకు కరుణాకర్‌తోపాటు మరిద్దరితో అక్రమ సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవమానం భరించలేక, కూతురు ఇకలేదన్న వేదనతో కల్యాణ్ ప్రాణం తీసుకున్నాడని బంధువులు చెబుతున్నారు.