అమెరికాలో ఓ మెడికల్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక రోగితో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. నెవాడా పర్వప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదంలో వైద్య సిబ్బంది, రోగి సహా ఐదుగురు మరణించినట్లు విమానం నుండి అంబులెన్స్ సేవలను అందించే సంస్థ వెల్లడించింది.
A News 4 viewer in Stagecoach sent us these photos from the deadly Care Flight plane crash which killed all five members on board late Friday night. The NTSB has taken over the investigation and is expected to host a news conference Sunday.
More >> https://t.co/ddw1FiWFAU pic.twitter.com/pZ8CEqvMy8
— KRNV (@KRNV) February 25, 2023
లియోన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం నెవాడాలోని స్టేజ్‌కోచ్ సమీపంలో రాత్రి 9:15 గంటలకు విమాన ప్రమాదం గురించి అధికారులకు కాల్ వచ్చినట్లు తెలిపింది. రెండు గంటల తర్వాత శిధిలాలను కనుగొన్నామని చెప్పారు. విమాన ప్రమాదంలో మరణించిన ఐదుగురి బంధువులకు సమాచారం అందించారు. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. లియోన్ కౌంటీలోని కొన్ని ప్రాంతాలతో సహా నెవాడా కోసం నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసిన శీతాకాలపు తుఫాను హెచ్చరికల మధ్య ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. భారీ మంచు కురుస్తుండటంతో చాలా ఆటంకాలు ఎదురవుతున్నట్లు అధికారు తెలిపారు.