Medical professional 'beheaded' in Maharashtra's Amravati for 'sharing post in support of Nupur Sharma'
mictv telugu

దర్జీ హత్య తరహాలో మరొకరి తల నరికివేత.. ప్రవక్తపై వ్యాఖ్యల వివాదమే?

June 30, 2022

 

రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో పట్టపగలే టైలర్‌ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజ్ స్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజస్థాన్ లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. అయితే సరిగ్గా ఈ ఘటనకు వారం ముందే ముంబయిలోనూ అచ్చం ఇదే తరహా హత్య ఒకటి చోటుచేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఉమేశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం, అతడు కూడా నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వుండడంతో ఇది కూడా మతోన్మాద చర్యగా తలెత్తుతోంది. రాజస్థాన్‌లో వెలుగు చూసిన హత్యతో మహారాష్ట్ర ఘటనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు అందరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మెడికల్‌ సామాగ్రి వ్యాపారి ఉమేష్ కోల్హే జూన్ 22న దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రిపూట తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో అడ్డగించిన నలుగురు దుండగులు అతడి మెడ కోసి దారుణంగా హత్య చేశారు. ఆ వెనుకే మరో బైక్ మీద వస్తున్న ఉమేష్ కొడుకు, భార్యలు ఇది గమనించి హంతకులను వెంబడించే‌లోపే వారి అక్కడి నుండి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి.. అబ్దుల్‌ తౌఫిక్‌, షోయెబ్‌ ఖాన్‌, అతీఖ్‌ రషీద్‌ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ హత్యకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికి రాజస్థాన్ ఘటన నేపథ్యంలో సరికొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.
ఉదయ్ పూర్‌లో కన్హయ్యను మర్డర్ చేసిన విధంగానే ఉమేష్ కొల్హేను సైతం గొంతుకోసి చంపేశారు. దీంతో ఈ ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్ కులకర్ణి ఆరోపించారు. నుపుర్ శర్మకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టలు పెట్టడం వల్లే ఇలా జరిగిందని, అమరావతి కమిషనర్‌ ఆర్తి సింగ్‌ను కలిసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోపే ఉదయ్‌పూర్‌ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించిన పోలీసులు.. దర్యాప్తు చేయిస్తున్నారు.