వైద్యసిబ్బందిపై మళ్లీ దాడి.. ఆశా వర్కర్‌కు గాయాలు
కరోనా మహమ్మారిపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి రక్షణ కరువైంది. వారిపై దాడి చేస్తే రూ. 7 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తెచ్చిన ఫలితం లేకుండా పోయింది. మూఢనమ్మకాలు, భయం, మతఛాందసాలతో వారిపై దాడులకు తెగబడుతున్నారు. దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో ఒకచోట వారిపై భౌతికదాడులు సాగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ జిల్లాలో కొవిడ్-19 సర్వే కోసం వెళ్లిన మహిళా వైద్యసిబ్బందిపై దాడి జరిగింది.
మాకాన్ పూర్ గ్రామంలో కరోనా అనుమానితులు ఉన్నారని సమాచారం రావడంతో ఆశావర్కర్లు అక్కడికి వెళల్లారు కొందరు స్థానికులు వారి చేతుల్లోని కాగితాలను చించేసిన అనుచితంగా ప్రవర్తించాయి. ఒక మహిళకు గాయాలయ్యాయి. వారు భయంతో అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుల్లో ఒకరిడిని పట్టుకున్నారు.