Home > Featured > హెల్త్ వర్కర్ సాహసం… ప్రాణాలకు తెగించి, ప్రాణం పోసి..

హెల్త్ వర్కర్ సాహసం… ప్రాణాలకు తెగించి, ప్రాణం పోసి..

మనసు ఉండాలే కానీ మార్గాలు అనేకం. ప్రజాసేవ చేయాలనే సంకల్పం, చేస్తున్న పనిపై అంకిత భావం రెండూ ఆమెను నదిని కూడా లెక్కచేయనీయలేదు. గ్రామం చుట్టూ నీళ్లు ఉన్నా వాటిని దాటుకొని వెళ్లి పేద ప్రజలకు వైద్యసేవలను అందించింది. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి తానున్నానంటూ ధైర్యం చెప్పి అండగా నిలిచింది ఓ ఆశావర్కర్. ఆమె చేసిన సేవను అంతా ప్రశంసించారు.

ఛత్తీస్‌ఘర్‌లోని బిల్హాపూర్‌ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఊళ్లోకి వెళ్లాలంటే భారీగా ప్రవహిస్తున్న నదిని దాటే వెళ్లాలి. అయినా ఆమె భయపడలేదు. వైద్యసేవలు చేయడం తన లక్ష్యంగా భావించి గ్రామస్తుల సాయంతో ఊళ్లోకి వెళ్లి చికిత్స చేసింది. ఇలా చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. తమకోసం నదిని దాటుకొని వచ్చిన ఆమెకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మామూలు రోజుల్లోనే గ్రామాల్లో కనిపించని హెల్త్ వర్కర్లు ఉన్న ఈ రోజుల్లో వరదల సమయంలో కూడా భయపడకుండా వచ్చి వైద్యం చేసి ఎంతో మందికి ఆమె ఆదర్శంగా నిలిచారు.

Updated : 17 Sep 2019 2:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top