Medico Preethi : మెడికో ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి...మృతురాలి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వోద్యోగం..!! - Telugu News - Mic tv
mictv telugu

Medico Preethi : మెడికో ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…మృతురాలి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వోద్యోగం..!!

February 27, 2023

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కేఎంసీ వైద్య విద్యార్థి మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బాధితురాలి కుటుంబానికి రూ. 30లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతురాలి కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది సర్కార్. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని…సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ప్రీతి ఘటన అత్యంత బాధాకరం…ఎవరూ పూడ్చలేని దు:ఖం ఆ కుటుంబంది అన్నారు. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

 

మృత్యువుతో పోరాడుతూ ప్రీతి మరణించడం అత్యంత బాధాకరమన్నారు ఆరోగ్యశాఖ మంత్రి హారీశ్ రావు. వైద్యుల నిర్విరామంగా, శక్తివంచల లేకుండా శ్రమించిందన్నారు. పూర్తి ఆరోగ్య వంతురాలై వస్తుందనుకుంటే అనంత లోకాలకు వెళ్లిపోవడం నా మనస్సు తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.