రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృస్టించిన కేఎంసీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తనకి ప్రీతి ఎదురు చెప్పడంతోనే కోపం పెంచుకొని ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రెండు ఘటనలను అతడిని తీవ్రం కోపానికి గురిచేశాయి. దీంతో తోటి విద్యార్థులకు ప్రీతీని టార్గెట్ చేయాలని సైఫ్ తెలిపినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు
హెచ్ఓడీకి ఫిర్యాదు చేయడంతో ఆగ్రహం
ప్రీతి ఆత్మహత్యకేసులో భాగంగా నిందితుడు సైఫ్ ఫోన్‌లో వాట్సాప్ చాట్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రధానంగా భార్గవి, DVV+Knockout గ్రూప్ లలో క్షుణ్ణంగా చూసి కీలక విషయాలను గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అనస్థీషియా విభాగంలో ప్రీతి సూపర్ వైజర్ గా సైఫ్ ఉన్నాడు. . ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రాసింది. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
వాట్సాప్ గ్రూప్‌లో అవమానం
ప్రీతి రాసిన అనస్థీషియా రిపోర్ట్‌పై సైఫ్ వాట్సాప్ గ్రూప్ వేదికగా హేళన చేశాడు. రిజర్వేషన్‌లో వస్తే ఇలాగే ఉంటుందంటూ గ్రూప్‌లో చర్చించాడు సైఫ్. దీంతో ప్రీతి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరి ముందు హేళన చేయొద్దని ఏమైనా ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని వార్నింగ్ ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న సైఫ్..ప్రీతిని వేధించాలని మరో విద్యార్థి భార్గవ్‌కు సూచించాడు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా డ్యూటీ వేయాలని తెలిపాడు. దీంతో ఆమె హెచ్ఓడీ నాగార్జునని కలిసి ఫిర్యాదు చేయగా..ప్రీతి, సైఫ్ కు ముగ్గురు డాక్టర్ల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ తరువాతి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.