దృశ్యం నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతోందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే కథానాయికగా రాణించి 1990లలో అగ్రనటిగా రాణించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో అగ్ర హీరోలందరితోనూ పని చేసింది. అదే విధంగా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ సరసన నటించింది. మీనా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే 2009లో బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను వివాహం చేసుకుంది.వారికి నైనికా అనే కుమార్తె ఉంది. మీనా కూతురు కూడా బాలనటి. ఇంతలో ఆమె జీవితంలో విషాదం అలుముకుంది. అనారోగ్యంతో ఆమె భర్త జూన్ లో మరణించాడు. అప్పటి నుండి ఆ విషాదంలోనే మీనా ఉండిపోయింది.
అయితే మొన్నామధ్య మీనా రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. వెంటనే వాటిని మీనా ఖండించింది కూడా. డబ్బుల కోసం మీరు ఏమైనా చేస్తారా అంటూ కోలీవుడ్ మీడియాపై ఫైర్ అయింది. ఇక అప్పటి నుండి మీనా రెండో పెళ్లిపై వార్తలు కాస్త తగ్గినా మళ్ళీ ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు ఈ నటి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తమిళ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండో పెళ్లి చేసుకోవాలని మీనా తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వారి ఒత్తిడికి తలొగ్గిన మీనా ఎట్టకేలకు మళ్లీ జోడీ కట్టేందుకు అంగీకరించిందని చెబుతున్నారు. వరుడు కూడా తెలిసిన వ్యక్తే. ఆమె దివంగత భర్త స్నేహితుడిగా చెబుతున్నారు. అయితే ఈ వార్తలను మీనా లేదా ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా మాత్రం ఇంకా ధృవీకరించలేదు.