Meena shares pictures with three friends who consoled her
mictv telugu

ఫ్రెండ్‌షిప్ డే.. నటి మీనాను కలిసిన ఆనాటి హీరోయిన్స్

August 9, 2022

భర్త మరణం తర్వాత నటి మీనా ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కోలుకుంటున్నారు. మళ్లీ సాధార‌ణ జీవితానికి అల‌వాటు ప‌డుతున్నారు. ఈ సీనియ‌ర్ న‌టిని తాజాగా ఇండ‌స్ట్రీకి చెందిన కొందరు స్నేహితులు కలిశారు. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సీనియర్ హీరోయిన్లు రంభ‌ , సంఘ‌వి , సంగీత లు మీనా ఇంట్లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను మీనా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత మీనా చేసిన తొలి పోస్ట్ ఇది.

వీరంతా ఒక చోట చేరి కెమెరాకు ఫోజులిచ్చారు. మ‌రోవైపు త‌మ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మీనా చివ‌రిసారిగా మోహ‌న్ బాబు లీడ్ రోల్ చేసిన స‌న్నాఫ్ ఇండియాలో న‌టించింది. ప్ర‌స్తుతం త‌మిళ సినిమా రౌడీ బేబిలో కీ రోల్ చేస్తోంది.