మీరా చోప్రా కేసు.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ త్వరలో అరెస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

మీరా చోప్రా కేసు.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ త్వరలో అరెస్ట్!

June 6, 2020

gvnvghn vbg

నటి మీరా చోప్రాను సోషల్ మీడియాలో అదే పనిగా వేధిస్తున్న జూ. ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు గుర్తించారు. వారి ట్విటర్ ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా అడ్రసులు గుర్తించి నోటీసులు పంపారు. మొత్తం 15 మందికి నోటీసులు పంపారని, రేపోమాపో వారిని అరెస్ట్ చేసే అవకాశముందని సమాచారం. 

జూ.ఎన్టీఆర్ అభిమానులు తనపై కక్ష గట్టి బూతులు తిడుతున్నారని మీరా చోప్రా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడం, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించడం తెలిసిందే. బూతు కామెంట్ల స్క్రీన్లు సాక్ష్యంగా ఉండడంతో నిందితులు తప్పించుకునే అవకాశం లేదు. ఇటీవల మీరా అభిమానులతో ముచ్చిస్తూ తనకు మహేశ్ బాబు అంటే ఇష్టమని, తాను జూ. ఎన్టీఆర్ అభిమానని కాదని చెప్పింది. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆమెపై తిట్లకు లంకించుకున్నారు. ‘నిన్ను రేప్ చేస్తాం.. మా హీరోలో ఏం తక్కువ?’ అని వేధింపులకు పాల్పడ్డారు.