నిర్భయ దోషులను ఉరి తీయడానికి తలారీ దొరికాడు - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషులను ఉరి తీయడానికి తలారీ దొరికాడు

December 12, 2019

555

నిర్భయను అత్యంత పాశవికంగా చంపేసిన దోషులకు ఉరి వేసేందుకు మెల్లమెల్లగా లైన్ క్లియర్ అవుతోంది. ఉరిశిక్ష  ఖరారు అయినప్పటికీ వీరికి ఇప్పటి వరకు శిక్ష విధించలేదు. తీహార్ జైలులో తలారి కూడా లేకపోవడంతో శిక్ష వాయిదా వేస్తూ వచ్చారు. దిశ ఘటన తర్వాత మరోసారి వీరి ఉరి అంశం తెరపైకి వచ్చింది. దీంతో వారిని మేం ఉరి తీస్తాం అంటూ కొంత మంది రాష్ట్రపతికి లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు తలారిని గుర్తించారు. 

తీహార్ జైలులో దోషులను ఉరి తీసేందుకు దేశంలోని వివిధ జైళ్లకు తీహార్ అధికారులు లేఖలు రాశారు. తమ వద్ద తలారీలు ఉంటే పంపించాలని కోరారు. దీనిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఉరి తీసేందుకు అతన్ని తీహార్ జైలుకు పంపించేందుకు ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఇక నిందితులకు ఉరి ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా తలారి పవన్ కుమార్ దేశంలోనే ప్రొఫెషనల్‌గా గుర్తింపు పొందారు.గతంలో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలిని ఇతడు ఉరి తీశారు. ఇప్పుడు నిర్భయ దోషులకు ఉరి తీసే అవకాశం కల్పించారు.