చలాన్ పడిందని.. రోడ్డుపై బోరున ఏడ్చేశాడు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

 చలాన్ పడిందని.. రోడ్డుపై బోరున ఏడ్చేశాడు (వీడియో)

November 29, 2019

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా వేస్తారు. ఆ మొత్తాన్ని చెల్లించి తర్వాత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చలానా ఉరిశిక్షేమీ కాదు. కానీ ఓ కుర్రాడు ఏ మూడ్‌లో ఉన్నాడో ఏమోగాని అది ఉరిశిక్షే అన్నంతగా ఇదైపోయాడు. నడిరోడ్డుపై కోపంతో తన బైకును కింద పడేసి హంగామా చేశాడు. దానిపై కూర్చున బోరుబోరున ఏడ్చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ తతంగం. 

హెల్మెట్ పెట్టుకోనందుకు పోలీసులు ఓ యువకుడికి చలానా వేశాడు. మనోడు అదేదో పెద్ద నేరంగా ఫీలైపోయి బండిని కిందపడేసి హల్ చల్ చేశాడు. తర్వాత దానిపై కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేశాడు. ఈ దృశ్యాన్ని ఓ జర్నలిస్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు.