మనిషికి సగటున దాదాపు 6-8 గంటల నిద్ర అవసరం. ఒక రోజు నిద్ర సరిగా లేకపోతేనే ఎలాగో ఉంటుంది. అలాంటిది ఒకతను దాదాపు 60 యేండ్లుగా కంటి మీద కునుకు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాడు.
ఎవరైనా నిద్రపడడానికి ఇష్టపడరా? శివరాత్రికి తప్ప మన దగ్గర జాగారాలంటూ చేయరు. కానీ వియత్నాంకు చెందిన థాయ్ ఎన్ గోక్ ని కలువండి. అతను 1962 నుంచి తాను నిద్రపోలేదని పేర్కొన్నాడు. ఇతని గురించి కథనం యూట్యూబ్ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నది.
థాయ్.. వయసు 80 సంవత్సరాలు. 20యేండ్ల వయసులో జ్వరం వచ్చింది. దీంతో నిద్ర అనేది కరువైంది. ఇది ఒక రకమైన కేసు అని డాక్టర్లు కూడా తేల్చేశారు. అతని భార్య, పిల్లలు, స్నేహితులు, పొరుగువారు అతను నిద్రపోవడాన్ని ఎప్పుడూ చూడలేదని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అతని పరిస్థితి పరీక్షించడానికి చాలామంది ప్రయత్నించారు. మామూలుగా నిద్రలేకపోతే అది మానసిక ఆరోగ్యాన్నిదెబ్బతీస్తుంది. కానీ అది అతని ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఎన్ గోక్ ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాడు. మంచి ఆహారాన్ని అనుసరించడం ద్వారా అతను ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు.
డ్రూ బిన్స్కీ అనే యూట్యూబర్ వియత్నాంలో థాయ్ వెతికి మరీ ఇతన్ని కనుగొన్నాడు. ఫిబ్రవరి 2న ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వీక్షణలు ఉన్నాయి. ఆ వ్యక్తిని వివరంగా ఇంటర్వ్యూ చేశారు. మనిషి ఎందుకు నిద్రపోవడం లేదనే దానిపై ఎవరికీ ఆధారాలు లేవని కూడా ఈ వీడియోలో చెప్పారు. థాయ్.. గ్రీన్ టీ, వైన్ ఇష్టంగా తీసుకుంటాడని చెప్పాడు. అతని గురించి ఇది వరకు విన్నాం.. ఇప్పటికీ అతను ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇది నిజంగా ఆనందంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు.