అభిమాని అంటే ఇతడే.. 24 గంటలు మోడీ జపం! - MicTv.in - Telugu News
mictv telugu

అభిమాని అంటే ఇతడే.. 24 గంటలు మోడీ జపం!

September 19, 2020

Meet Anmol Bakaya, the YouTuber who chanted ‘Modiji’ for 24 hours on PM’s birthday

రామనామ జపం చేసినవారిని చూశాం. కన్నవారిని పూజించేవారిని చూశాం. ఇష్టమైన సినీ హీరోహీరోయిన్ల కోసం ప్రాణాలు అర్పించిన అభిమానులను చూశాం. కొంతమంది అభిమాన తారలకు గుళ్లు కట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఓ అభిమాని ఉన్నాడు. అతన్ని సాదాసీదా అభిమాని అనికూడా అనలేం. ఎందుకంటే అతను మోదీ నామజపాన్ని ఎన్నిసార్లు ఉచ్ఛరించాడో తెలిస్తే షాక్ అవుతారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా అన్‌మోల్ బకాయా అనే వీరాభిమాని వినూత్నరీతిలో మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. యూట్యూబర్ అయిన అన్‌మోల్ తన ఛానల్‌లో ప్రధాని మోదీకి యూ ట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. 

ఒకటి రెండూ గంటలు కాకుండా ‘మోదీజీ’ మోదీజీ’ అంటూ ఏకంగా 24 గంటల పాటు మోదీ పేరు జపిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ లైవ్ జపం సందర్భంగా స్క్రీన్‌పై కౌంటింగ్ కూడా ప్రదర్శించాడు. 24 గంటల్లో ఏకంగా 1,03,643 సార్లు ‘మోదీజీ’ పేరును జపించాడు. కాగా, సెప్టెంబరు 17న మోదీ తన 70వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో పాటు సామాన్యులు సైతం ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.