భారతీయ మహిళా పైలట్ ప్రపంచ రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ మహిళా పైలట్ ప్రపంచ రికార్డు

May 15, 2019

పట్టుదల వుండాలి గానీ సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించింది 23 ఏళ్ల యువతి. లైట్ స్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ఎస్ఏ)లో అట్లాంటిక్ మహాసముద్రం దాటి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన కెప్టెన్ ఆరోహి పండిత్ 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇకాలుయిట్ విమానాశ్రయంలో దిగింది. ఆమె తన యాత్ర పూర్తి చేసిన ఎయిర్ క్రాఫ్ట్ పేరు ‘మాహి’. మాహి ఒక చిన్న సింగిల్ ఇంజన్ సైనస్ 912 విమానం. 400 కిలోగ్రాములకు కొంచెం ఎక్కువ వుంటుంది దీని బరువు.

సోమవారం-మంగళవారం చిన్న ఎయిర్ క్రాఫ్ట్‌తో ఆరోహి గతేడాది జూలై 30న యాత్ర ప్రారంభించింది.  జూలై 30, 2019కి భారత్ తిరిగి వస్తుంది. ఈ యాత్రలో ఆమె గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్‌లలో కూడా ఆగింది.

ఆరోహి యాత్ర గురించి ఆమె యాత్రను స్పాన్సర్ చేసిన సోషల్ ఎసెస్ సంస్థ చీఫ్ లియన్ డిసూజా మాట్లాడుతూ.. ‘ఏడాది క్రితం ఆరోహి పండిత్  ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించింది. తన స్నేహితురాలు కేథర్ మిస్క్వెట్లాతో కలిసి యాత్ర ప్రారంభించింది. ఈ యాత్రలో ఎల్ఎస్ఏ ద్వారా గ్రీన్ ల్యాండ్ దాటి ఆరోహి మరొక ప్రపంచ రికార్డ్ సాధించింది. భారత్ తిరిగి వచ్చేలోగా ఆమె మరెన్నో రికార్డులు సాధిస్తుంది’ అని తెలిపారు.