వాళ్ల జీవితాల్లో అదో అద్భుతం - MicTv.in - Telugu News
mictv telugu

వాళ్ల జీవితాల్లో అదో అద్భుతం

June 17, 2017

భార్య ఐపీఎస్ అధికారి.. భర్త ఐపీఎస్ ఆఫీసర్..ఇద్దరూ ఒకే బ్యాచ్..ఒకే ర్యాంకు. ఏదో మీటింగుల్లో కలుసుకోవడం కామన్. కానీ ఒకరి నుంచి మరొకరు చార్జ్ తీసుకోవాల్సి వస్తే…వావ్ గ్రేట్… వండర్ వరల్డే. ఈ సిచ్యూయేషన్ రావడం చాలా రేర్… ఇంతకీ ఏ కపుల్ ని ఈ అదృష్టం వరించిందంటే..

భార్యభర్తలైన అజిత, సతీష్ కేరళ కేడర్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు. ఒకే బ్యాచ్ చెందిన వీరికి మంచి పేరుంది. సతీష్ కొల్లం ఎస్పీగా పనిచేస్తే.. ఆమె మరో జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నారు. కేరళలో ఈమధ్యనే ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా వీరిద్దరికి బదిలీ అయింది. ట్విస్టు ఏంటంటే
లైఫ్ లో ఇలాంటి సిచ్చూయేషన్ వస్తుందని వీళ్లు ఊహించారో లేదో గానీ… ఒకరి నుంచి మరొకరు చార్జ్ తీసుకునే అవకాశం వచ్చింది. కొల్లం ఎస్పీగా సతీష్ నుంచి అజిత చార్జ్ తీసుకుంది. బాధ్యతలు అప్పగించిన భర్త సతీష్ బదిలీపై పతానంతిట్ట ఎస్పీగా వెళ్లారు. ఇంట్లో భార్యకు భర్త పని అప్పజెప్పినట్టే ఉంది కదా…నిజంగా సూపర్ ..వావ్ వాటే గ్రేట్ ఐపీఎస్ కపుల్…