కుక్క ముఖంపై తోక మొలిచింది..! - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క ముఖంపై తోక మొలిచింది..!

November 14, 2019

ఏ జంతువుకైనా వెనుక వైపే తోక ఉంటుంది. కానీ, ఆ కుక్కకు మాత్రం ముఖంపై కూడా తోక ఉంది. దీంతో ఆ కుక్క ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని మిస్సోరీలో ‘మాక్స్ మిషన్’ అనే జంతు సంరక్షణ సిబ్బంది వద్ద ఉన్న ఈ కుక్కకు రెండు తోకలు ఉన్నాయి. ఒక తోక వెనుక వైపు ఉంటే.. మరొకటి నుదిటి పైన మొలిచింది. రెండున్నర నెలల వయస్సు గల ఈ కుక్కకు ‘నార్వాల్’ అని పేరు పెట్టారు.

ఈ సందర్భంగా మాక్స్ మిషన్ వ్యవస్థాపకుడు రాచెల్లె స్టెఫ్ఫెన్ మాట్లాడుతూ..’తన ముఖంపై తోక ఉందనే సంగతి నర్వాల్‌కు తెలియదు. అది చాలా ఆరోగ్యంగా ఉంది. ముఖం ఉన్నది తోకలా కనిపిస్తుంది. కానీ, అది తోకలా ఊగదు. అది దాని ముఖంపై అదనంగా ఏర్పడిన భాగం మాత్రమే. అయినా సరే, అది చాలా అందంగా కనిపిస్తుంది’ అని తెలిపారు. నర్వాల్‌ను చూసిన నెటిజన్లు దాన్ని తమ ఇంట్లో పెంచుకుంటామని కోరుతున్నారు.  దాన్ని ఇప్పట్లో దత్తతకు ఇచ్చే ఉద్దేశం తమకు లేదని రాచెల్లె తెలిపారు. ముఖం మీద ఉన్న తోక పెద్దదైతే దానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో దాన్ని కొన్నాళ్లు తమ దగ్గరే ఉంచుకుంటాం అంటున్నారు.