కార్గిల్ మోటార్ సైకిల్.. మన జవాన్ల కోసమే - MicTv.in - Telugu News
mictv telugu

కార్గిల్ మోటార్ సైకిల్.. మన జవాన్ల కోసమే

February 20, 2020

Meet Royal Enfield Electra 350 KARGIL By Ornithopter Moto Design

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రా 350 మోటార్ సైకిల్‌ను రీడిజైన్ చేస్తే వచ్చే సరికొత్త బుల్లెట్ కార్గిల్. చిత్రంగా ఉంది కదూ.. మీరు విన్నది నిజమే దీనిని ప్రత్యేకించి సైనికుల కోసం తయారుచేశారు. నాసిక్ బేస్డ్ బైక్ బిల్డర్ ఆర్నీథాప్టర్ మోటో అనే కంపెనీ ఈ బుల్లెట్‌ను జవాన్ల కోసం తాయారుచేసింది. ఈ బండిని మళ్లీ రీడిజైన్ చేసేందుకు ఆ సంస్థకు 90వేల రూపాయల ఖర్చయింది. ఈ మోటార్ సైకిల్ కఠిన మైన రోడ్లపైనా దూసుకెళ్తుంది. జవాన్ల కోసం రూపొందించారంటే ఈ బండి ఎలా ఉంటుంది, ఇంజిన్, డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేశారు తదితర వివరాలు తెలుసుకోవాల్సిందే. 

పూర్తిగా నలుపు రంగులో ఉండే ఈ బండి ఇంధనం ట్యాంకుపై తెలుపు రంగులో సైనికుల బొమ్మలు పెయింట్ చేసి ఉంటాయి. అంతేకాకుండా ఎల్ఈడీ హెడ్ లైట్లు, టెయిల్ ల్యాంపునకు ఎల్ఈడీ స్ట్రిప్, ఒరిజినల్ రేర్ వ్యూ మిర్రర్స్‌ను తీసేసి సరికొత్తగా రీడిజైన్ చేశారు. ఈ బైక్‌లో వెనక సీటు మడిచేలా రూపొందించారు. దీని వల్ల ఒక్కరే ప్రయాణించే వెసలుబాటు ఉంటుంది. సైడ్ బాక్స్‌లో ఎయిర్ ఫిల్టర్, టూల్ కిట్, ఫ్యూజస్ లాంటివి అమర్చారు. స్టాక్ మఫ్లర్ స్థానంలో లాంగ్ రేంజ్ గన్ పెట్టుకునేలా డిజైన్ చేశారు. రేర్ ఫెండర్ పై నెంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు.

అయితే ఈ మోటార్ సైకిల్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 ఎలక్ట్రా మోడల్ మాదిరే 346 సీసీ సింగిల్ సిలీండ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 19.8 బీహెచ్ పీ పవర్, 28 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ.. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో పనిచేస్తుంది. ఈ బైక్‌ను తొలుత ఆకాశ్ జెండే అనే సైనికుడు నాసిక్‌లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో అతడి కోసం తయారుచేశారు. అతడు ఆరు నెలలపాటు వీరి యూనిట్‌తో కలిసి ఈ బండిని వినియోగించాడు.