మీరు మాంసం తినరా? అయితే మెంటల్ ఎక్కుద్ది - MicTv.in - Telugu News
mictv telugu

మీరు మాంసం తినరా? అయితే మెంటల్ ఎక్కుద్ది

December 13, 2017

మాంసం తినని యువకులు పిచ్చోళ్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వారానికి కనీసం మూడు సార్లైనా నాన్ వెజ్ తినకుంటే మెంటల్ ఎక్కుతుందని ఓ సర్వే తేల్చింది. మెడికల్ జర్నల్ న్యూట్రిషినల్ న్యూరోసైన్స్ లో ఈ సర్వే పబ్లిష్ అయింది. దాని ప్రకారం “18 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న యువత మూడ్, ప్రవర్తన వాళ్లు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.

రెగ్యులర్ గా మాంసం తినే వ్యక్తుల బ్రేయిన్ లో సిరోటోనిన్, డోపమైన్ అనే రెండు రసాయనాలు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ కెమికల్స్ తో ఆయా వ్యక్తుల మానసిక స్థితి సాధారణంగా ఉంటుంది. నాన్ వెజ్ తినకపోవడంతో పాటు వారానికి మూడు సార్లైనా వ్యాయామం చేయని వాళ్ల మెదళ్లలో ఆ రసాయనాలు విడుదల కావు. ఇది అంతిమంగా మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. పిచ్చోళ్లుగా మారే ప్రమాదం కూడా ఉంది.”

          మాంసం తినకుంటే మెంటల్ ఎక్కుతుంది. నిజమే అనుకుందాం. మరి ప్యూర్ శాఖహారుల సంగతి ఏంది? వాళ్లంతా పిచ్చోళ్లుగా మారారా? మారుతారా? ఎప్పుడు? ఈ ప్రశ్నలకు ఆ సర్వేలో సమాధానం లేదు.