కేరళ మహిళ వరల్డ్ రికార్డ్.. 90 రోజుల్లో 350 కోర్సులు కంప్లీట్  - MicTv.in - Telugu News
mictv telugu

కేరళ మహిళ వరల్డ్ రికార్డ్.. 90 రోజుల్లో 350 కోర్సులు కంప్లీట్ 

October 2, 2020

Meet this Kerala woman who completed 350 online courses in 90 days during lockdown.

ప్రతికూల పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మార్చుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. ‘అయ్యో ఈ కరోనా నా కొంప ముంచింది. ఇంటికే పరిమితం చేసి నా ఉద్యోగానికి గండి కొట్టింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి?’ ఇలా చాలామంది పరేషాన్ అయ్యారు. కానీ, కొందరు మాత్రమే ఈ పరిస్థితుల్లో కూడా తమ బుర్రను ఉపయోగించి ఇతర మార్గాల్లో ఈ లాక్‌డౌన్ సమయాన్ని వాడుకున్నారు. కరోనా అయినా ఇంకేదైనా సమయం సమయమే కదా. ఆ సమయానికి విలువ ఇచ్చిన ఓ మహిళ 90 రోజుల్లో ఏకంగా 350 కోర్సులు పూర్తి చేసి ఔరా అనిపించింది. ప్రపంచ రికార్డు సృష్టించిన  ఆ మహిళ పేరు ఆరతి రఘునాథ్. ఆమెది కేరళ రాష్ట్రంలో ఉన్న కొచ్చిలోని ఎలమక్కర ప్రాంతంలో ఉంటుంది. ఆరతి ఎంఇఎస్ కాలేజీలో ఎమ్మెస్సీ బ‌యోకెమిస్ట్రీ రెండో సంవత్సరం చ‌దువుతోంది. 

గత 90 రోజుల్లో ఆమె Coursera ప్లాట్‌ఫామ్ ద్వారా 350 కోర్సులు పూర్తి చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో చక్కగా కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఆమె యూనివర్సల్ రికార్డు ఫోరమ్ (URF) నుంచి ప్రపంచ రికార్డును  సొంతం చేసుకుంది. ఆరతి సాధించిన ఘనత గురించి తెలిసి ఆమె తల్లిదండ్రులు గర్వంతో పొంగిపోతున్నారు. ఈ సందర్భంగా ఆరతి మాట్లాడుతూ.. ‘కాలేజీలో నా గురువులే నాకు ఆన్‌లైన్ కోర్సులను పరిచయం చేశారు. వారు పరిచయం చేసిన ఆ విద్యను లాక్‌డౌన్‌లో సమర్థంగా వినియోగించుకున్నాను. ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడానికి నా కోఆర్డినేటర్, క్లాస్ ట్యూటర్ సహకారం అందించారు’ అని ఆరతి తెలిపింది.