మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి చేసిన రోజా వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. రోజా కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి తేడా లేదని ఘాటుగా విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడిన ఆయన “టాప్ 20 ర్యాంకింగ్స్‌లో దేశంలో ఏపీ పర్యటక శాఖ 18వ స్థానంలో ఉంది. రోజా బాధ్యత మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇలా పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానంకు దిగజారే అవకాశం ఉంది. ఏపీ పర్యాటకశాఖ మీద వేలాది మంది పేద ప్రజలు బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు. ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకోని ఎలా డవలప్ చేయాలో నేర్చుకో. నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను ఇష్టానుసారంగా మాట్లాడినా నేను ఎందుకు మాట్లాడలేదంటూ..నీ నోటికి..మున్సిపాలిటీ చెత్తకుప్పకి తేడా లేదు అందుకే నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు” అని నాగబాబు విమర్శించారు.
రోజా @RojaSelvamaniRK
నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023
అసలు రోజా ఏమన్నారు..?
చంద్రబాబు కుప్పం పర్యటనపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రోజా ఎంట్రీ ఇచ్చి టీడీపీపై విమర్శలు గుప్పించారు. పనిలోపాటుగా పవన్‌పై కూడా విల్లు ఎక్కుపెట్టారు. చంద్రబాబు సభలో అంతమంది అమాయకులు చనిపోతే జనసేనాని ఎందుకు స్పందంచరని ధ్వజమెత్తారు. అంతటితో ఊరుకోకుండా చిరంజీవిని దీనిలోకి లాగేశారు. మెగా బ్రదర్స్ ఎవరికీ సాయం చేయరని అందుకే సొంత జిల్లాలోనే విజయం సాధించలేకపోయారంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్, నాగబాబులు సొంత ప్రజలు ఓడించారంటేవారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు కనీస మానవత్వం లేని ఉండదు, ఒక ఎమోషన్స్ లేవు.. వాళ్లు ఆర్టిస్టుగా అయినందుకు ఒక ఆర్టిస్టుగా సిగ్గుపడుతున్నాను అంటూ రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా చేసిన ఈ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మెగా అభిమానులు, జనసేన నాయకులు రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మధ్యలో చిరంజీవిని ఎందుకు లాగారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.