నూర్‌ భాయ్‌ మృతి..మెగా ఫ్యామిలీ సంతాపం - MicTv.in - Telugu News
mictv telugu

నూర్‌ భాయ్‌ మృతి..మెగా ఫ్యామిలీ సంతాపం

December 8, 2019

Mega family.

తెలుగు నటీనటులు తమ అభిమానులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు ఏ ఆపద వచ్చినా వెంటనే మేమున్నాం అంటూ ముందుకు వస్తారు. అభిమానులు మరణిస్తే సినిమా కార్యక్రమాలను వాయిదా దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మెగా అభిమాని నూర్ మహమ్మద్ మృతిచెందడంతో అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ విడుదల తేదీ ప్రకటనను చిత్ర బృందం వాయిదా వేసింది. 

హైదరాబాద్‌‌కు చెందిన నూర్‌ మహ్మద్‌ కొన్ని దశాబ్దాలుగా మెగా అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మెగా హీరోలు అతడిని ముద్దుగా నూర్‌ భాయ్‌ అని పిలిచేవారు. మెగా కుటుంబానికి మద్ధతుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నూర్‌ భాయ్‌ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు ఆయనకు సంతాపం తెలిపారు. ధృవ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు ప్లాన్‌ చేసిన కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.