Mega family hero Pavan Tej who married anchor...
mictv telugu

యాంకర్‌ను పెళ్లాడిన మెగా ఫ్యామిలీ హీరో…

August 11, 2022

టాలీవుడ్‌లో మరో యువ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుంది. కొణిదెల కుటుంబానికి చెందిన యువ హీరో పవన్‌ తేజ్‌, నటి, యాంకర్‌ మేఘన త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక, ఈ నిశ్చితార్థ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ హాజరయ్యారు. అయితే, తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను పవన్‌తేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని’ రాసుకొచ్చాడు.

అనంతరం మేఘన సైతం పవన్‌ తేజ్‌‌పై ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌‌లో వెల్లడించింది. ‘నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక, నా జీవితం అంతా నీకే సొంతం’ అని రాసుకొచ్చింది.

పవన్‌ తేజ్‌ విషయానికొస్తే..రామ్ చరణ్‌కు పవన్ తేజ్ వరుసకు తమ్ముడు అవుతాడు. ‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా మేఘన నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. కాగా పవన్‌ తేజ నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా మేఘన బుల్లితెర షో యాంకర్‌గా అలరిస్తోంది.

https://www.instagram.com/m_y_megganna/?utm_source=ig_embed&ig_rid=6ac018f4-cd8f-4c58-a5f6-96294d67a079