మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ రెండో భర్త కల్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వార్తతో పాటు కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో వాటిన చూసిన వారు నిజంగానే పెళ్లి చేసుకున్నాడన్న అభిప్రాయానికి వస్తున్నారు. శ్రీజ, కల్యాణ్‌లు గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. శ్రీజ తండ్రి వద్ద, కల్యాణ్ తన పేరెంట్స్‌తో కలిసి ఉంటున్నారు. విడివిడిగా ఉంటున్నప్పటికీ విడాకుల ప్రకటన ఇంతవరకు చేయలేదు. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి కల్యాణ్ పేరు తొలగంచడంతో ఇద్దరూ విడిపోయారని కచ్చితంగా తెలుస్తోంది. అయితే ఈ అనధికార మాజీ భార్యాభర్తలు వాలంటైన్స్ డే సందర్భంగా పెట్టిన పోస్టులు వారి ఉద్దేశాన్ని తెలుపుతున్నాయని భావిస్తున్నారు. మొదట కల్యాణ్.. ఒక వ్యక్తిని ప్రేమించడం కంటే అతడిని ఎలా ట్రీట్ చేస్తున్నామన్నదే ముఖ్యమని కామెంట్ చేశాడు. దీనికి కౌంటర్‌గా.. ఒకరిని ప్రేమించడం అంటే వాళ్లని వాళ్లు ఎక్కువగా ప్రేమించుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు. ప్రేమను గుర్తించాలి. కానీ ప్రతీ విషయంలో దాన్ని వెతకకూడదని శ్రీజ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ పెళ్లి వేడుకలో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. వివరాలు తెలుసుకుంటే అది తన ఫ్రెండ్ పెళ్లి అని తేలింది. దానికి కల్యాణ్‌తో పాటు అతని స్నేహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు వైరల్ కావడంతో జనాలు మరోలా భ్రమపడ్డారు. ఇక విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలు చేశారు. అవి అంతగా ఆకట్టుకోకపోవడంతో కొత్త సినిమాకు కల్యాణ్ సంతకం చేయలేదని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి మద్ధతు లభించకపోవడంతో సినిమా కెరీర్‌కి స్వస్తి చెప్పాడని భావిస్తున్నారు.