మెగా ఇంట పెళ్లిసందడి.. సింపుల్‌గా నిహారిక నిశ్చితార్థం! - MicTv.in - Telugu News
mictv telugu

మెగా ఇంట పెళ్లిసందడి.. సింపుల్‌గా నిహారిక నిశ్చితార్థం!

August 13, 2020

Mega house wedding noise .. Simple niharika’s engagement!.

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల పెళ్లి సందడి అయిపోయింది. ఇక మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. పలు టీవీ షోలు, సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న మెగా డాటర్, నాగబాబు కుమార్తె, యువహీరో వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల. ఈరోజు నీహారిక వివాహ నిశ్చితార్థం జరిగింది. చాలా కొద్ది మంది కుటుంబ సభ్యులు, అతిథుల నడుమ ఈ నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, నాగబాబు దంపతులు హాజరయ్యారు. కరోనా నిబంధనల నేపథ్యంలో చాలా గోప్యంగా ఈ వేడుకను నిర్వహించారు. గతంలోనే నాగబాబు నిహారిక పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చారు. పెళ్లి ఫిబ్రవరిలో ఉండొచ్చని అయన చెప్పారు. ఇక మెగా వారింట్లో పెళ్లి సందడి మొదలైనట్టే. 

కాగా, గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన ప్రియుడిని నిహారిక సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.