Mega Jackpot..133.7 Crores alone..Where is it?
mictv telugu

మెగా జాక్‌పాట్..ఏకంగా 133.7 కోట్లు..ఎక్కడంటే?

September 22, 2022

తాజాగా సోషల్ మీడియాలో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి చెందిన అనూప్ అనే ఆటోడ్రైవర్‌ను అదృష్టం లాటరీ రూపంలో వరించిన విషయం తెలిసిందే. ఆ లాటరీలో అనూప్‌..ఏకంగా రూ.25 కోట్ల రూపాయలను గెలుచుకుని, వార్తల్లో నిలిచాడు. అయితే, తాజాగా మరో ఇద్దరు వ్యక్తులు మెగా జాక్‌పాట్ కొట్టారు. ఏకంగా ఏకంగా 133.7 కోట్ల రూపాయలను గెలిచి, అమెరికా చరిత్రలో కొత్త రికార్డ్‌ను నమోదు చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. తాజాగా అమెరికా దేశంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు అమెరికన్లు..మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. ఈ ఏడాది జూలై చివర్లో ఓ పెట్రోల్ బంక్‌లో కొన్న టికెట్‌ ద్వారా వారికి ఈ అదృష్టం వరించింది.

లాటరీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ”ఏక మొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్. గత ఏప్రిల్ నుంచి వరుసగా 29 డ్రాలు జరిగాయి. ఇది అమెరికా చరిత్రలోనే మూడవది. త్వరలోనే వారికి ఈ అమౌంట్‌ను అందజేస్తాం” నిర్వాహకులు తెలియజేశారు.