తిత్లీ బాధిత గ్రామానికి రామ్ చరణ్ అండగా.. - MicTv.in - Telugu News
mictv telugu

తిత్లీ బాధిత గ్రామానికి రామ్ చరణ్ అండగా..

October 21, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిత్లీ తుపాను ఎంత బీభత్సం సృష్టించితో తెలిసిందే.. తుఫాను దాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులను ఆదుకునేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా తిత్లీ బాధితులకు సాయం చేసేందుకు మెగా పవర్ స్టార్ ముందుకొచ్చారు.Mega Power Star Ram Charan Adopt One Of The Affected Village By Thithili తుపాను బాధిత ప్రాంతాల్లోని ఓ గ్రామాని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చరణ్ తెలిపాడు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు అల్లు అర్జున్ 25 లక్షలు‌, ఎన్టీఆర్‌ 15లక్షలు, విజయ్‌ దేవరకొండ 5లక్షలు, నందమూరి కళ్యాణ్‌ రామ్‌ 5లక్షలు, వరుణ్‌ తేజ్‌ 5లక్షలు, కొరటాల శివ 3లక్షలు, అనిల్‌ రావిపూడి లక్ష, సంపూర్ణేష్‌ బాబు యాభై వేలు ప్రకటించారు.