mega power star ram charan got grand welcome at midnight in hyderabad airport
mictv telugu

అర్ధరాత్రి రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

March 18, 2023

mega power star ram charan got grand welcome at midnight in hyderabad airport

లాజ్ ఏంజిల్స్‏లో జరిగిన ఆస్కార్ వేడుకల అనంతరం రామ్ చరణ్ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో మెగా పవర్ స్టార్‏కు ఆయన ఫ్యాన్స్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద ఘనస్వాగతం పలికారు. అర్ధరాత్రి వేళ ఎవరూ ఊహించని విధంగా అభిమానులు భారీ ర్యాలీని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై చరణ్, జై ఆర్ఆర్ఆర్ అంటూ ఫ్యాన్స్ చేసే నినాదాలతో ఎయిర్‍‏పోర్ట్ దద్దరిల్లింది.

 

పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చెర్రీని కలిసేందుకు ఎయిర్ పోర్ట్‏కు వచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి చరణ్ షాకయ్యాడు. అభిమానుల ప్రేమను చూసి వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రామ్ చరణ్ పోలీసుల బందోబస్తుతో తన ఇంటికి బయల్దేరారు. చరణ్ వాహనం వెంటే అభిమానులు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అర్ధరాత్రి వేళ రామ్ చరణ్ ఫ్యాన్స్ చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెస్ట్ చేస్తున్నారు.