Mega Powerstar Ram Charan recently met Telangana state Minister KTR and Mahindra Group Chairman Anand Mahindra
mictv telugu

నేటి నుంచి ఫార్ములా-ఈ రేసింగ్.. కేటీఆర్‎పై రామ్ చరణ్ పొగడ్తలు

February 10, 2023

Mega Powerstar Ram Charan recently met Telangana state Minister KTR and Mahindra Group Chairman Anand Mahindra

హైదరాబాద్ వేదికగా ఫార్ములా-ఈ రేసింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు ఈ రేసులో పాల్గొంటున్నాయి. సా.4:30 నిమిషాలకు తొలి ప్రాక్టీస్ రేస్ జరుగుతుంది. ఫార్ములా-ఈ రేసు ప్రారంభం సందర్భంగా మహింద్రా గ్రూప్ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో టాలీవుడ్ హీరో రామ్‎ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహీంద్రా రేసింగ్ టీమ్‌ను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాకుండా మహింద్రా అధినేత ఆనంద్ మహింద్రా, తెలంగాణ మంత్రి కేటీఆర్, టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీలతో కాసేపు మాట్లాడారు. ఈ విషయంపై తాజాగా రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నానీలతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని తెలిపారు. రేసులో మహింద్ర జట్టు విజయం సాధించాలని ఆకాక్షించారు. ఇంతటి అమోఘమైన కార్యక్రమాలు తీసుకువస్తున్న కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రామ్ చరణ్ వెల్లడించారు.

హుస్సేన్‌సాగర్ తీరాన జరిగే ఈ అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. లుంబినిపార్కు నుంచి ప్రారంభమై సచివాలయ పక్క నుంచి మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్ వరకు రేస్ సాగనుంది. రేసును 21 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.